వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలోకి మాజీ డిప్యూటీ సిఎం: కాంగ్రెస్‌పై మోడీ దెబ్బ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi - Keshubai
అహ్మదాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌కు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెసు మాజీ ఉప ముఖ్యమంత్రి అమిన్ పటేల్‌తో చెక్ పెట్టారు! మోడీతే విభేదించిన కేశూభాయ్ భారతీయ జనతా పార్టీని వీడి గుజరాత్ పరివర్తన్ పార్టీ పెట్టుకున్నారు. కేశూభాయ్ సొంత కుంపటి పెట్టుకోవడం తమకు లాభిస్తుందని కాంగ్రెసు గట్టి విశ్వాసంతో ఉంది. అయితే అనూహ్యంగా చక్రం తిప్పిన మోడీ కాంగ్రెసు నేత అమిన్‌ను తన వైపుకు ఆకర్షించారు.

అమిన్ గురువారం బిజెపిలో చేరారు. కేశూభాయ్ బయటకు వెళ్లిపోవడంతో బిజెపికి పటేల్‌ల ఓట్లు దూరమవుతాయని అందరూ భావించారు. కాంగ్రెసు కూడా అదే నమ్మకం పెట్టుకుంది. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెసు నేత అమిన్ పటేల్ బిజెపిలో చేరడంతో మోడీ పటేల్‌ల ఓట్లు కేశూభాయ్ వైపు, కాంగ్రెసు వైపు మరలకుండా చేశారు.

శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌కు ఇది ఊహించని ఎదురు దెబ్బే. పటేల్ సామాజిక వర్గంలో అమీన్‌కు గణనీయంగా పలుకుబడి ఉంది. ఇరవై ఒక్క ఏళ్లుగా పార్టీతో అనుబంధం ఉన్న ఆయనకు ప్రస్తుత ఎన్నికల్లో టికెట్‌ను కాంగ్రెస్ నిరాకరించింది.

ముక్కూమొహం ప్రజలకు తెలియని వారికి పార్టీ టికెట్లు కాంగ్రెస్ ఇచ్చిందని, కేంద్ర మంత్రి సిపి జోషి ఇందుకు కారణమని అమీన్ ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధిస్తుందని, మోడీ హ్యాట్రిక్ సాధిస్తారని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ నిష్క్రమణతో సౌరాష్ట్ర ప్రాంతంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్న బిజెపికి అమీన్ చేరిక ఆయాచిత వరంలా మారిందనే చెప్పవచ్చు.

English summary
The Patel factor is making the electoral battle in Gujarat more intersting Gujarat more interesting this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X