వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: సోనియా ఇంటి ముట్టడి యత్నం, లాఠీఛార్జ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఉస్మానియా విశ్వవిద్యార్థుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకొని లాఠీలకు పని చెప్పారు. 2009 డిసెంబర్ 9వ తేదిన కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసి వెనక్కి వెళ్లిందని ఆరోపిస్తూ ఓయు విద్యార్థులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు.

ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన విద్యార్థులు కాసేపటికి సోనియా నివాసం అయిన టెన్ జనపథ్‌ వైపుకు చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. వారిని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డగించారు. తాము సోనియా నివాసాన్ని ముట్టడించి తీరుతామని విద్యార్థులు అన్నారు. వారు ఎంతకూ తగ్గక పోవడంతో పోలీసులు వారి పైన లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 2009 డిసెంబర్ 9వ తేదిన కేంద్రం చేసిన ప్రకటనకు కట్టిబడి ఉండాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన కాంగ్రెసు ప్రభుత్వం ఆ తర్వాత సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన ప్రకటనను అదే నెల 23న వెనక్కి తీసుకుందని ఆరోపించారు. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. విద్యార్థులు జెఏసి జెండాలు పట్టుకొని ఆందోళన చేశారు.

కాగా మరోవైపు ఈ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో టెన్ జనపథ్ కోలాహలంగా మారింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెసు నేతలు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెసు నేతలు తమ అధినేత్రి పుట్టిన రోజును జరుపుతున్నారు. మరోవైపు ఏఐసిసి కార్యాలయం ఎదుట కూడా విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

English summary
OU students were tried to siege AICC president Sonia Gandhi's resident at 10 Janpath on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X