ఏ పార్టీయో చెప్పలేను: జయప్రద, చేరికపై తర్జన భర్జన

ఇప్పుడు కూడా తాను వస్తానని, ఏ పార్టీలో చేరేది మాత్రం అప్పుడే చెప్పలేనన్నారు. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఏ పార్టీలో చేరాలనే నిర్ణయంపై తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. జయప్రద కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేవు. గతంలో టిడిపిలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో స్వల్ప విభేదాల కారణంగా ఆమె ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లి పోయారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు కొత్తగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నేతలు జగన్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలిచింది. ఈ నేపథ్యంలో గత పరిచయం కారణంగా ఆమె మనసు తెలుగుదేశం పార్టీ వైపుకు లాగుతున్నప్పటికీ జగన్ పార్టీ హవా కొనసాగుతుండటంతో అటువైపు కూడా ఆలోచిస్తున్నట్లుగా ఉందంటున్నారు.
అందుకే సంవత్సరంన్నరగా రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇస్తున్న జయప్రద ఏ పార్టీలో తేలే అంశాన్ని మాత్రం తేల్చలేక పోతున్నారని అంటున్నారు. పార్టీలో చేరే అంశాన్ని ప్రశ్నిస్తే ఆమె తాను ప్రస్తుతం యూపి రాజకీయాల్లో ఉన్నానని, కాబట్టి ఇప్పుడే చెప్పడం సమంజసం కాదని కూడా గతంలో చెప్పారు. టిడిపిలో చేరాలా లేక జగన్ పార్టీలో చేరాలా అనే దానిపై ఆమె తేల్చుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications