హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌ను తెలంగాణ అడ్డుకున్నారు: కాంగ్రెసు ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar-Manda Jagannatham
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, రాజయ్య విరుచుకుపడ్డారు. తెలంగాణపై కేంద్రం చొరవను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన తలపెట్టన అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నారని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశ్యాన్ని కేంద్రం గ్రహించిందని, అందుకే అఖిల పక్ష సమావేశం తేదీని మార్చలేదని అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి మూలంగానే తెలంగాణ అంశం వెనక్కి పోయిందని వారు విమర్శించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నాయని వారున్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ వైఖరిని చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెసు అభిప్రాయం చెప్తేనే తాము చెప్తామని తప్పించుకునే ధోరణి వద్దని వారన్నారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పకపోతే ఎలా అని వారన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. అఖిల పక్ష సమావేశం వాయిదా వేయాలని కోరి తాను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రిని అని నిరూపించుకున్నారని వారు వ్యాఖ్యానించారు. సీమాంద్రలో పార్టీ ఉంటే చాలు, తెలంగాణలో పార్టీ పోయినా ఫరవా లేదనే పద్ధతిలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వారన్నారు.

తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకపోతే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని వారన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సోమవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయవద్దని వారు కోరారు. షిండే కూడా సమావేశాన్ని వాయిదా వేయడానికి నిరాకరించారు. కాగా, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లడపాటి రాజగోపాల్ షిండేను కలిశారు.

English summary
Congress Telangana MPs Ponnam Prabhakar, Manda Jagannatham and Rajaiah have blamed CM Kiran Kumar Reddy on stalemate on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X