వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీన్స్ వేస్తే జరిమానా: అమ్మాయిలపై ఆంక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

How dress diktat on girl students make us 'Taliban-like'
న్యూఢిల్లీ: హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థినుల వస్త్రధారణపై ఆంక్షలు విధించడంపై మహిళా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. హర్యానాలోని భివానీలో గల కళశాలలో జీన్స్ ధరించవద్దని ఆంక్షలు పెట్టారు. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘిస్తే వంద రూపాయల జరిమానా విధిస్తామని కాలేజీ అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఆదర్శ్ మహిళా కళాశాల విద్యార్థినులకు ఆ విధమైన ఆదేశాలు జారీ చేసింది.

జీన్స్, నల్లరంగు దుస్తులు, ఆభరణాలు ధరించవద్దని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో డ్రెస్ కోడ్‌పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది నమ్మశక్యం కాని విషయమని, ఆధునిక సమాజాంలో ఇటువంటి ఆదేశాలు జారీ చేయడమేమిటని బెంగళూర్‌లోని ఓ మహిళా సామాజిక కార్యకర్త అన్నారు.

విద్యార్థినులకు అటువంటి ఆంక్షలు పెట్టడంలో తప్పేమీ లేదని, ఇది భారతీయ సంస్కృతిని గౌరవించడమని, జీన్స్ , టాప్స్ పాశ్చాత్య దుస్తులని ఆదర్శ్ కళాశాల ప్రిన్సిపాల్ అల్కా శర్మ అంటున్నారు. పాశ్చాత్య వస్త్రధారణ పిల్లలను చదువుల నుంచి మనస్సును మళ్లిస్తాయని, అవాంఛనీయమైన చూపులు పడి వేధింపులకు గురవుతారని ఆమె అన్నారు. టీన్స్‌లో ఉన్న పిల్లలు మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, వాటి వాడకంపై కూడా ఆంక్షలు పెట్టామని చెప్పారు.

విద్యార్థులకే కాకుండా సిబ్బందికి కూడా కాలేజీ డ్రెస్ కోడ్ పెట్టింది. ప్రతి సోమవారం విద్యార్థినులు తెల్లటి సాల్వార్ కమీజు, ఇతర రోజుల్లో రంగుల సాల్వార్ కమీజు ధరించాలి. మహిళా సిబ్బంది చీరలు మాత్రమే ధరించాలి. పురుష సిబ్బందికి కూడా డ్రెస్ కోడ్ ఉంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా తాము విద్యార్థినులను జీన్స్, పొడువై కుర్తా ధరించడానికి అనమతించామని, అయితే అమ్మాయిలు జీన్స్‌పై టీ - షర్టులు ధరిస్తున్నారని అల్కా శర్మ చెప్పారు.

English summary
Women groups have expressed anger over dress code forced upon girl students in Haryana and Uttar Pradesh. In a college in Bhiwani, Haryana, girls have been barred from wearing jeans. And if anyone is found violating the dress code, the student has to pay a fine of Rs 100.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X