వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహం చిచ్చు: పురంధేశ్వరిపై బాలయ్య ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపన వివాదం నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఉంది. తాజాగా, నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ పార్టీ అధ్యక్షుడు, బావ నారా చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తూ తన సోదరి, కేంద్ర మంత్రి పురంధేశ్వరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఎన్టీ రామారావు విగ్రహం విషయంలో పురంధేశరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు వాదనలను ఆయన ఖండించారు.

చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకు పురంధేశ్వరి చేస్తున్న ప్రయత్నం సరి కాదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెసు వ్యతిరేక ప్రభుత్వాల స్థాపనకు కృషి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు సమర్థత వల్లనే కాంగ్రెసు ఆధిపత్యానికి గండి పడిందని ఆయన అన్నారు.

కేంద్రంలో విపి సింగ్, ఐకె గుజ్రాల్, దేవెగౌడ ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు. బాలయోగి స్పీకర్‌గా ఉన్నప్పుడే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుమతి తీసుకుందని, ఎన్టీఆర్‌తో పాటు అల్లూరి సీతారామరాజు విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ కోరిందని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ను వైయస్ రాజశేఖర రెడ్డితో పోల్చడమేనా ఇంత వరకు మీరు చేసిందంటూ ఆయన పురంధేశ్వరి దంపతులను ప్రశ్నించారు.

Daggubati - Purandeswari - balakrishna

రాష్ట్ర ప్రభుత్వం తరఫున విగ్రహం ఇచ్చేందుకు వైయస్ రాజశేఖర రెడ్డి సానుకూలంగా స్పందించలేదని ఆయన చెప్పారు. పురంధేశ్వరి సంతకం కోసం తాను ప్రయత్నిస్తే పురంధేశ్వరి దొరకకుండా తప్పించుకున్నారని ఆయన విమర్శించారు. పురంధేశ్వరి కోసం తాను మూడు సార్లు ఫోన్‌లో మాట్లాడినా గడువు ముగిసే వరకు కాలయాపన చేశారని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులంతా ఇచ్చిన లేఖను కాదని, పురంధేశ్వరి తన ఘనతగా చెప్పుకోవడం ఏమిటని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో చంద్రబాబుకు వేరే ఉద్దేశాలు లేవని ఆయన అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన ప్రక్రియ ఘనత అంతా చంద్రబాబుదేనని ఆయన అన్నారు. పురంధేశ్వరి క్రెడిట్ కోసం పాకులాడితే తాము విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రయత్నించామని ఆయన అన్నారు. పురంధేశ్వరి సంతకం తీసుకోవాలని చంద్రబాబు తనకు చెప్తే అందుకు తాను ప్రయత్నించానని ఆయన అన్నారు. చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకు దగ్గుబాటి దంపతులు పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు కుటిల యత్నాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

English summary
Nandamuri hero and Telugudesam party leader Balakrishna has retaliated union minister and his sister Dagubati Purandeswari and her husband Venkateswar Rao on NTR statue row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X