వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహంపై బాబుకు యార్లగడ్డ కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Yarlagadda Lakshmi Prasad
హైదరాబాద్: పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్ఠాపన వివాదం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఎన్టీ రామారావు విగ్రహంపై చంద్రబాబు రాసిన బహిరంగ లేఖలోని అంశాలన్నీ అబద్ధాలేనని మాజీ పార్లమెంటు సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. అప్పటి విగ్రహాల కమిటీలో దివంగత నేత ఎర్రంనాయుడు లేరని ఆయన స్పష్టం చేశారు.

2000 నాటి విగ్రహాల కమిటీ ప్రొసీడింగ్సు‌ను ఆయన బయటపెట్టారు. ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు విగ్రహాలు పెట్టాలని ఎర్రంనాయుడు చెప్పారని లేఖలో చంద్రబాబు చేసిన ప్రస్తావనలో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. లేఖలోని అంశాలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపనపై చంద్రబాబుకు, కేంద్ర మంత్రి పురంధేశ్వరికి మధ్య లేఖ యుద్ధం కొనసాగుతుండగా, ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి మధ్యలోకి వచ్చారు. భార్యనైన తన సంతకం లేకుండా ఎన్టీఆర్ విగ్రహానికి ఎలా అనుమతి పొందుతారంటూ ఆమె విరుచుకుపడ్డారు. అటు పురంధేశ్వరిపై, ఇటు చంద్రబాబుపై ఆమె విమర్శలు చేశారు.

తన భర్త ఎన్టీఆర్‌ను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని ఆమె పురంధేశ్వరి, చంద్రబాబులను కోరారు. చంద్రబాబు ఆయనకు భారతరత్న రాకుండా నీచ రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. మరోసారి ఇలాంటి రాజకీయాలకు పాల్పడితే ఊరుకునే సమస్య లేదన్నారు. కాంగ్రెసు పార్టీని ఎదిరించి బయటకు వచ్చాడు కనుకనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తున్నానని చెప్పారు.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండేవారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కూడా ఆయన సాన్నిహిత్యం ఉంది.

English summary
Former MP Yarlagadda Lakshmi Prasad has refuted Telugudesam party president N Chandrababu Naidu's claim on NT Rama Rao statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X