ఎన్టీఆర్: ఆ ఇద్దరిపై లక్ష్మీపార్వతి ఫైర్, జగన్‌కు సపోర్ట్...

Laxmi Parvathi
హైదరాబాద్: పార్లమెంటులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుపై రగడలోకి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఎంటర్ అయ్యారు. ఆమె మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరిలపై నిప్పులు చెరిగారు. అధికారం నుండి ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడానికి కారణమైన వారిద్దరికీ ఆయన పేరు ఎత్తే నైతిక అర్హత ఏమాత్రం లేదన్నారు.

చంద్రబాబు, పురంధేశ్వరి ఎన్టీఆర్ విగ్రహం పేరిట కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు ఆయన భార్యనైన తన సంతకం కావాలన్న కామన్ సెన్స్ వారికి లేకపోవడం విచారకరమన్నారు. ఈ విషయమై తాను ఈ రోజే స్పీకర్ మీరా కుమార్‌కు లేఖ రాస్తానని చెప్పారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరు పెట్టినా తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని చెప్పారు.

భార్యగా తన సంతకం కూడా అవసరమన్నారు. తన భర్తను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని ఆమె పురంధేశ్వరి, చంద్రబాబులను కోరారు. చంద్రబాబు ఆయనకు భారతరత్న రాకుండా నీచ రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. మరోసారి ఇలాంటి రాజకీయాలకు పాల్పడితే ఊరుకునే సమస్య లేదన్నారు. కాంగ్రెసు పార్టీని ఎదిరించి బయటకు వచ్చాడు కనుకనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+