లేఖ తీసుకోలేదు, కాంగ్రెసు డ్రామా: తెలంగాణపై బాబు

తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కేంద్రం ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 'వస్తున్నా... మీకోసం' పాద యాత్రలో భాగంగా మంగళవారం అదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ తెలంగాణవాదులు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
కొన్ని పార్టీలు తమ పార్టీని లక్ష్యం చేసుకున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల సొత్తును కాంగ్రెస్ పార్టీలో కొందరు దోచుకుని, రాష్ట్రాని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకీ ఇచ్చిన లేఖను ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని మరోమారు స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత పణీధర్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. వస్తున్నా... మీకోసం పాదయాత్రలో చంద్రబాబుకు మంగళవారం తెలంగాణ సెగ తగిలింది. దిలావార్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో చంద్రబాబును చూడగానే యువకులు కొంత మంది ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో పలువురు తెలంగాణవాదులను, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications