సత్యం రూ.822కోట్లు జఫ్తు: ఈడి ఉత్తర్వులపై హైకోర్టు స్టే

High Court
హైదరాబాద్: సత్యం కుంభకోణానికి సంబంధించి కేసులో సత్యం కంపెనీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఊరట లభించింది. కంపెనీ ఆస్తుల జఫ్తునకు సంబంధించి ఈడి(ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) ఇచ్చి ఉత్తర్వులపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. ఈడి సత్యం కేసులో రూ.822 కోట్ల విలువైన ఆస్తులను జఫ్తు చేయడాన్ని సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనల అనంతరం హైకోర్టు ఈడి ఆదేశాలను నిలుపుదల చేసింది.

కాగా సత్యం కుంభకోణం కేసుకు సంబంధించి రూ.822 కోట్ల ఎఫ్‌డిలను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) రెండు నెలల క్రితం జఫ్తు చేసిన విషయం తెలిసిందే. ఈడి చరిత్రలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని జఫ్తు చేయడం అదే ప్రథమం. (ఆ తర్వాత ఇటీవల ఓఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన రూ.884 కోట్లు ఈడి జఫ్తు చేసింది.) ఈ మొత్తం సత్యం ఖాతాలోనివి. ఈడి రూ.822 కోట్లను జప్తు చేశాయి.

అంతకుముందు రెండు నెలల క్రితం రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంటుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిసేషన్(సిబిఐ)కి కోర్టు బుధవారం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. రామలింగ రాజు ఆస్తుల కేసు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల అటాచ్‌మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్‌మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యం రామలింగ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైన 1063 ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటి అటాచ్‌మెంట్‌కు కోర్టు సిబిఐకి అనుమతించింది. ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+