• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'ఇడియట్స్' తెచ్చిన తిప్పలు: కట్జూకు లీగల్ నోటీసులు

By Srinivas
|
Markandey Katju
లక్నో/న్యూఢిల్లీ: భారతీయుల్లో తొంభై శాతం మంది ఇడియట్లేనని వ్యాఖ్యానించిన ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్డిస్ మార్కండేయ కట్జూకు ఇద్దరు లక్నో యువకులు నోటీసులు పంపించారు. కట్జూ వ్యాఖ్యలు భారతీయులను అవమానించేలా ఉన్నాయని దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ లక్నోకు చెందిన ఇద్దరు విద్యార్థులు తాన్యా ఠాకూర్, ఆదిత్య ఠాకూర్‌లో లీగల్ నోటీసులు పంపించారు.

కాగా నోటీసుల అనంతరం కట్జూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. బ్లాగులో ఆయన వివరణ ఇచ్చారు. తొంభై శాతం మంది భారతీయులు ఇడియట్స్ అని, వారికి మెదళ్లు లేవని తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినో నొప్పించేందుకు కాదన్నారు. నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని మేల్కొనేలా చేసేందుకే ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరిని కించపర్చాలని కాదన్నారు. పలు కారణాల వల్ల భారత్ అభివృద్ధిలో వెనుకబడుతోందని, ఆ కోణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.

కాగా భారతీయుల్లో తొంభై శాతం మంది ఇడియట్లేనని ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుజు జస్టిస్ మార్కండేయ కట్జూ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వారు మతం, కులం, జాతి పేరుతో స్వార్థపూరిత శక్తులు పన్నే కుట్రల్లో ఇరికిపోతారన్నారు. ఈ తొంభై శాతం మందిని వంచించడం చాలా సులభం అన్నారు. చదువుకున్నా కులం, జాతి ఆధారంగా ఓట్లేస్తారన్నారు. రూ.2వేలతో ఢిల్లీలాంటి నగరాల్లో మత ఘర్షణలు సృష్టించవచ్చునని అన్నారు. వారి తలల్లో మెదడు లేదన్నారు.

ఏదైనా ఒక ప్రార్థనా స్థలం వద్ద అవతలి వారిని అగౌరవపరిచేలా ప్రవర్తిస్తే చాలని వెంటనే పరస్పరం కొట్టుకోవడం ప్రారంభిస్తారని అన్నారు. 1857కు ముందు అసలు దేశంలో మతమౌఢ్యం అన్నదే లేదని, కానీ ఇప్పటి పరిస్థితి వేర్నారు. ఇటు హిందువుల్లోను, అటు ముస్లింలలోను 80 శాతం మంది మతమౌఢ్యులేనని, ఇది కఠోర వాస్తవమైనా తాను చెబుతున్నానన్నారు.

ఇంగ్లీషు భాష అందరిలో విషాన్ని నింపుతోందన్నారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశాన్ని నియంత్రించేందుకు హిందూ - ముస్లింలు కొట్టుకునేలా చేయాలని ఇంగ్లీష్ వారు భావించారన్నారు. అప్పటి నుండి అది కొనసాగుతోందన్నారు. హిందీ హిందువుల భాషగాను, ఉర్దూను ముస్లింల భాషగాను ప్రచారం చేశారన్నారు. భారతీయులు మూర్ఖులుగా ఉండకూడదనే తానీ కఠోర వాస్తవాలు చెబుతున్నానని అన్నారు.

భారత-పాకిస్థాన్‌ల విలీనమే కాశ్మీర్ సమస్యకు ఏకైక పరిష్కారం అన్నారు. కులం, జాతి ప్రాతిపదికన ఓటేయడం ద్వారా ఎంత వెనుకబడిపోయామో తెలియాలంటే గట్టి దెబ్బ తలగాలన్నారు. అప్పుడే స్పృహలోకి వస్తారన్నారు. యుద్ధరంగంలో వార్తా సేకరణకు ప్రాణాలొడ్డమని తాను చెప్పనని, తుపాకీ కణతకు పెట్టినప్పుడు సిద్ధంతాలు ముఖ్యం కాదన్నారు. ప్రాణాలు లేకపోతే ఏవీ లేవని, మౌనంగా తప్పుకోవడమే ముఖ్యమన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chairman of the Press Council of India, Just ice Katju, clarified on Monday that his remark that 90 percent Indians were fools was not interned to hurt anyone but to awaken people to harsh realities.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more