వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిద్దూ వల్లే కిరణ్, హైకమాండ్ కళ్లు తెరవాలి: పెద్దిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Peddireddy Ramachandra Reddy
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిదంబరం కారణంగానే ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారనేది తేటతెల్లమైందని కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కాంగ్రెస్ అసంతృప్త నేత, పుంగనూరు శాసససభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మమంగళవారం నాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కిరణ్‌కుమార్‌రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, అసమర్ధుడని , దీని వల్ల రాష్ట్రంలో పార్టీకి నష్టం జరుగుతోందని తెలిసినా కేవలం కేంద్ర మంత్రి చిదంబరం ఒత్తిడికారణంగానే కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.చిదంబరం నిజరూపం ఏమిటో ఇప్పుడు బట్టబయలైందని ఆయన అన్నారు. తాను ఎలాగైనా ప్రధాని కావాలన్న దురాశతో ఉన్న చిదంబరం అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ కాంగ్రెసుకు పట్టు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తన మనిషి ఉండాలన్న ముందుచూపుతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి విషయంలో పట్టుదల చూపారని దుయ్యబట్టారు.

కేవలం తాను ప్రధాని కావాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర మంత్రి చిదంబరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వ్యక్తిని నియమించుకున్నారన్న విషయం బట్ట బయలైనందున కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. చిదంబరం కుట్రను అర్ధం చేసుకొని కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉద్వాసన పలకాలని ఆయన డిమాండ్ చేశారు. కిరణ్ వ్యవహారశైలిపై తాను మొదటి నుంచి చెబుతున్నదే ఇప్పుడు నిజమవుతోన్నదని ఆయన అన్నారు.

వాన్‌పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ ముద్దాయిగా తేలిస్తే ఆయన తప్పేమీ లేదని రాష్ట్ర మంత్రివర్గం తీర్పు ఎలా ఇస్తుందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మరోసారి ప్రశ్నించారు. ధర్మాన విచారణకు అనుమతి మంజూరు విషయంలో గవర్నర్ విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.

English summary

 Congress rebel MLA Peddireddy Ramachandra Reddy once again lashed out at Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X