హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిగొచ్చిన ఎంపి సుజనా చౌదరి: సారీ చెప్పారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sujana Chowdary
హైదరాబాద్: పార్టీ సీనియర్ నేతలు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సారీ చెప్పారు. విచారం వ్యక్తం చేయడంతో తెలుగుదేశం పార్టీలోని వివాదం సద్దుమణిగింది. సంబంధిత శాసనసభ్యులకు ఫోన్లు చేసి ఆయన విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో శాసనసభ్యులు శాంతించినట్లు చెబుతున్నారు.

ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో ఓటింగ్ వివాదంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయని, తన తాహతు తెలియక కొంతమంది పార్టీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి తీరుపై తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఆయనతో పాటు కొత్తకోట దయాకర్ రెడ్డి వంటి మరికొంత మంది శాసనసభ్యులు కూడా సుజనా చౌదరి తీరును తప్పుపట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు. అటు కేశవ్‌తో, ఇటు సుజనా చౌదరితో ఆయన మాట్లాడారు. శాసనసభ్యుల మాటల్లో తప్పేమీ లేదని, పార్టీ శ్రేణుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని శాసనసభ్యులు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు సంయమనం వహించి ఉండాల్సిందని చంద్రబాబు సుజనా చౌదరితో అన్నట్లు సమాచారం.

చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని చెప్పడంతో సుజనా చౌదరి మంగళవారం ఉదయం ఎమ్మెల్యేలు కేశవ్, దయాకర్ రెడ్డిలకు ఫోన్లు చేసి తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారని అంటున్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తాను ఏదైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

English summary
Rajyasabha member Sujana Choudhary expressed his sadness for his comments against Telugudesam MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X