వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరిని అంటే రక్తం ఉడుకుతోంది: ఎన్టీఆర్ పెద్ద కొడుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari - Balakrishna
హైదరాబాద్: తన సోదరి, కేంద్రమంత్రి పురంధేశ్వరిని అనడం స్వర్గీయ నందమూరి తారక రామారావు పెద్ద తనయుడిగా తనకు చాలా బాధేసిందని ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ బుధవారం ఓ టీవీ ఛానల్‌తో అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఆరాధ్యుడన్నారు. ఆయన అందరికీ చెందిన వాడన్నారు. పురంధేశ్వరిని అంటుంటే ఆయన సోదరుడిగా రక్తం ఉడుకుతోందని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు.

కాగా పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం అంశంపై బాలకృష్ణ, పురంధేశ్వరి మధ్య పరోక్ష వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పురంధేశ్వరికి బాలయ్య ఘాటైన లేఖ రాయడం, దానిపై పురంధేశ్వరి స్పందించారు. బాలకృష్ణ రాసిన బహిరంగ లేఖపై ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రతిస్పందించారు. పార్లమెంటులో ప్రతిష్టాపనకు తాను ఒక్కదాన్నే విగ్రహం ఇవ్వాలని గానీ, ఆ కీర్తిని తాను మాత్రమే కొట్టేయాలని గానీ అనుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు.

బాలకృష్ణ తన కన్నా చిన్నవాడని, బాలకృష్ణ వ్యాఖ్యలతో తనకు చాలా బాధేసిందని ఆమె అన్నారు. తనపై చేసిన విమర్శలను చూసిన తర్వాత తాను ఫోన్ చేసి బాలయ్యతో మాట్లాడానని, తాను అనలేదని బాలకృష్ణ అంటున్నారని ఆమె అన్నారు. తన సంతకం కోసం ఎప్పుడు వచ్చావని అడిగితే రాలేదని బాలకృష్ణ అంగీకరించారని ఆమె అన్నారు. తన సంతకం కోసం బాలకృష్ణ ఎప్పుడు వచ్చాడో తనకు తెలియదని, ఆలా ఎప్పుడూ రాలేదని ఆమె అన్నారు.

రెండు మూడు సార్లు తనకు ఫోన్ చేశానని బాలకృష్ణ అన్నాడని, అప్పుడు కుటుంబపరంగా విగ్రహాన్ని ఇద్దామని తాము అనుకున్నామని, అయితే తన సంతకం లేకుండానే పార్లమెంటుకు వారు లేఖ ఇచ్చారని ఆమె అన్నారు. బాలయ్య తనకన్నా చిన్నవాడని, తనపై చేసిన వ్యాఖ్యలను బాలయ్య విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. వివాదానికి తాను కారణం కాదని, వివాదం ఎందుకు చోటు చేసుకుందో దాన్ని సృష్టించినవాళ్లనే అడగాలని ఆమె అన్నారు. అసలు వివాదమే లేదని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో తనకు స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ అందగానే తాను తన కన్నా పెద్దవాళ్ల ఇళ్లకు వెళ్లి విషయం మాట్లాడానని, తనకన్నా చిన్నవాళ్లను తన ఇంటికి అహ్వానించి మాట్లాడానని, కుటుంబపరంగా ఎన్టీ రామారావు విగ్రహం ఇద్దామని చర్చించుకున్నామని ఆమె వివరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఇంటికి కూడా తాను మూడు సార్లు లేఖను పంపించానని, అది తీసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరనే సమాధానం వచ్చిందని ఆమె అన్నారు. తాను ఒక్కదాన్నే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా అందరూ భాగస్వాములు కావాలి, కలిసి చేద్దామనే మాట మీద తాను నిలబడుతున్నానని ఆమె అన్నారు.

English summary

 Late NTR son Jayakrishna condemned Hero Balakrishna comments on central minister Purandeswari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X