ఆంధ్రా స్టైల్ 'వెల్లుల్లి కారం'.. ఈజీగా ఇలా తయారు చేసుకోండి..!
వేసవికాలం పూర్తి కావొస్తుంది.. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రాబోతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసి తింటుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి కారంగా తినాలనిపించినప్పుడు వెల్లుల్లి కారాన్ని ఇష్టంగా తయారు చేసుకుంటారు. వేడివేడి అన్నంలోకి మాత్రమే కాదు.. ఇడ్లీ, దోశ వంటి టిఫెన్స్ లోకి కూడా కలిపి తినవచ్చు. మరి ఈ ఆంధ్రా స్టైల్ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
ఆంధ్రా స్టైల్ 'వెల్లుల్లి కారం' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ఎండుమిర్చి 20 నుంచి 25, వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు, ధనియాలు రెండు చెంచాలు, జీలకర్ర ఒక చెంచా, చింతపండు చిన్న నిమ్మకాయ సైజంత, ఉప్పు రుచికి సరిపడా, నూనె రెండు స్పూన్ లు, కరివేపాకు రెండు రెమ్మలు తీసుకోవాలి. ఇప్పడు తయారీ విధానం చూస్తే.. ముందుగా ఎండు మిర్చి, సుగంధ ద్రవ్యాలను వేయించుకోవాలి.

ఆ తర్వాత అవి చల్లారాక చింతపండు, ఉప్పుతో కలిపి రుబ్బుకోవాలి. ఆ తర్వాత చివరగా వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి వేసిన తర్వాత వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ఆంధ్రా స్టైల్ వెల్లుల్లి కారం రెడీ అయినట్టే.. ఈ వెల్లుల్లి కారాన్ని గాజు సీసాలో భద్రపరచుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓసారి ఈ టేస్టీ ఆంధ్రా స్టైల్ వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి..












Click it and Unblock the Notifications