పార్టీ మారితే వచ్చేది...: కోమటిరెడ్డి, తెలంగాణపై కావూరి

కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తనకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం బాధగా ఉందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని విడిచి వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తి మాత్రం లేదన్నారు. తెలంగాణపై కేంద్రం ఈ నెల 28న జరపనున్న అఖిల పక్షంపై కూడా ఆయన స్పందించారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి వెళ్లాలని పార్టీ ఆదేశిస్తే.. వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
కాంగ్రెసు ముందు చెప్పాలి
తెలంగాణపై ముందు వైఖరి చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వేరుగా అన్నారు. ఎఫ్‌డిఐల కోసం తెలంగాణ ఎంపీల చేత ఓటేయించుకోవడానికే అఖిలపక్షం పెట్టారని ఆరోపించారు. తెలంగాణ మంత్రుల నిర్వాకంతో రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్తున్నారనే ప్రచారంపై స్పందిస్తూ.. వేరే పార్టీలోకి వెళ్లినా తనకు దక్కేది మంత్రి పదవే కదా అని ఎదురు ప్రశ్నించారు. మూడేళ్లు మంత్రి పదవి వదలుకుని తెలంగాణ కోసం పోరాడదామని నిర్ణయించుకున్నానని, అననుకూల పరిస్థితులతో ఆ పని చేయలేకపోయానన్నారు.
ఇద్దరు వెళ్తే కష్టం
ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడేందుకు ఏం చేయాలా అని కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తుందే తప్ప తెలంగాణపై శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించడం లేదని ఎంపి సబ్బం హరి అన్నారు. ప్రస్తుత ప్రక్రియ పరిష్కారం దిశగా నడవటం లేదని.. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పిలిస్తే సమస్య పరిష్కారం కాబోదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications