వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణే పెద్ద సమస్య: కెకె, మేం చెప్తాం: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి తెలంగాణే అతి పెద్ద సమస్య అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు శుక్రవారం అన్నారు. తెలంగాణ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ పైన ఉందన్నారు. ఈ నెల 16వ తేదిన జరిగే సదస్సులో తెలంగాణపై మాట్లాడవద్దని ఆంక్షలు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

తాము తెలంగాణ గురించి సదస్సులో మాట్లాడవద్దంటే తెలంగాణకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 28న జరగనున్న అఖిల పక్ష సమావేశానికి ఒక్కరినే పంపిస్తామని పార్టీ అధ్యక్షుడు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్య నాన్చితే పార్టీకి ఈ ప్రాంతంలో ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ సమస్య తర్వాతనే ఏదేనా అని ఆయన అన్నారు.

కాగా అంతకుముందు కేశవ రావు ఇంటిని లా కాలేజి విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ పరిష్కారానికి గవర్నర్ కృషి చేయాలి

తెలంగాణ సమస్య పరిష్కారానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిలో ఉండి నరసింహన్ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఇతర కాంగ్రెసు నేతలను కలవడమేమిటని ప్రశ్నించారు. అంతగా అవసరముంటే రాష్ట్రపతిని కలవాలన్నారు.

గవర్నర్ నరసింహన్ తెలంగాణ సమస్య పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ - హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొట్టకుండా సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. హోంమంత్రి మారినప్పుడల్లా పార్టీలు తెలంగాణపై వైఖరి చెప్పాలా అని నారాయణ మండిపడ్డారు. కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేకపోయినా తాము తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటిస్తామన్నారు. ఎన్నిసార్లు తమను ప్రశ్నించినా అఖిల పక్షంలో తాము తెలంగాణకు అనుకూలమనే చెబుతామన్నారు.

English summary
Congress party senior leader K Keshav Rao said Telangana is big issue to Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X