శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాను ప్రశ్నించినందుకే జగన్ జైలుకు: అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
శ్రీకాకుళం: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్‌ను అరెస్ట్ చేసి శుక్రవారానికి రెండు వందల రోజులు అయిన సందర్భంగా శ్రీకాకుళంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం తెలిపారు. ఆ కార్యక్రమానికి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు. హత్య చేసిన ఖైదీకి కూడా 6 నెలలు పూర్తి కాగానే బెయిలు మంజూరయ్యే అవకాశం ఉంటుందని, ఏ తప్పు చేయని జగన్‌కు బెయిల్ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఇది కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని తెలిపారు.

వైయస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉండగా ఒక్క మంత్రి కూడా జైలుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేయని మంత్రి ఎవరున్నారన్నారు. మోపిదేవి వెంకటరమణకు ఒక న్యాయం ధర్మాన ప్రసాదరావుకు మరో న్యాయామా అని ప్రశ్నించారు. త్వరలోనే జగన్ విడుదలవుతారని, ప్రజల కష్టాలు తీరుస్తారని అశాభావం వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకులంతా ఒకే కుటుంబమని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ధర్మాన పద్మప్రియ, అందవరపు సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
YSR Congress party spokesperson Ambati Rambabu criticized that his party president has been jailed for questioning Congress president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X