వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీతో ముంబై దాడులకు లింక్ పెట్టిన మాలిక్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబై దాడులకు సంబంధించిన తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాకిస్తాన్ ప్రయత్నాలు సాగిస్తోంది. 2008లో జరిగిను ముంబై దాడులకు, బాబ్రీ మసీదు సంఘటనకు ముడి పెట్టడానికి పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ చేసిన ప్రయత్నం ఈ విషయాన్ని తెలియజేస్తోంది.

భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ తర్వాత గత రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తాము 9/11ని కోరుకోవడం లేదని, బొంబాయి పేలుళ్లను వాంఛించడం లేదని, సమఝౌత ఎక్స్‌ప్రెస్ సంఘటనను కోరుకోవడం లేదని, బాబ్రీ మసీదు సంఘటనను వాంఛించడం లేదని, తాము తమ దేశంలోనే కాకుండా భారత్‌లో కూడా శాంతిని కోరుకుంటున్నామని, తద్వారా ఈ ప్రాంతంలో శాంతిని ఆకాంక్షిస్తున్నామని ఆయన అన్నారు.

ముంబై దాడులకు బాధ్యులైన అందరిపై తాము కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. కసబ్‌ను ఉరి తీసినప్పుడు తాను ముందుగా బయటకు వచ్చి భారత కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పానని ఆయన అన్నారు. అదే విధంగా పాకిస్తాన్‌లో విచారణ జరుగుతోందని, త్వరగా న్యాయం చేకూర్చడానికి ఫాస్ట్ కోర్టులో విచారణ జరిపిస్తున్నామని ఆయన అన్నారు.

Sushil Kumar Shinde-Rehman Malik

ముంబై దాడులకు సంబంధించి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ప్రాసిక్యూషన్‌కు భారత్ చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావించగా సయీద్‌కు సంబంధించి ప్రశ్నలు మిగిలి ఉన్నాయని అన్నారు. హఫీజ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని భారత ప్రజలు కోరుతున్నారని, అలాగే సమఝౌత ఎక్స్‌ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి ఏం జరిగిందనే వాస్తవాలను తాము అడుగుతున్నామని ఆయన అన్నారు.

మాలిక్ అన్ని విషయాలపై బయటకు మాట్లాడుతున్నారని, అయితే ముంబై దాడుల సూత్రధారులపై ఇస్లామాబాద్ చర్యలు తీసుకోవాల్సే ఉందని సుశీల్ కుమార్ షిండే అన్నారు.

English summary
Pakistan will seemingly go to any length to cover up its role in 26/11 and this was proved again when the country's Interior Minister Rehman Malik surprisingly tried to link the 2008 Mumbai terror attacks to the destruction of the Babri masjid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X