మెజార్టీ ఉంటే ఏ చట్టమైనా: ఆజాద్, పివి పేరు ప్రస్తావన

2014లో కష్టపడితే 2004 ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. సమన్వయ కమిటీ సమావేశానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. దేశంలో అభివృద్ధి కేవలం కాంగ్రెసు వల్లే సాధ్యమన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమే లక్ష్యంగా కాంగ్రెసు పార్టీ పని చేస్తోందన్నారు. 13, 14 ఏళ్లుగా కాంగ్రెసును సోనియా గాంధీ ముందుండి నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు బలహీనంగా లేదన్నారు. కాంగ్రెస్ బలహీనమైనదేమీ కాదన్నారు.
సోనియా గాంధీతో కాంగ్రెసుకు కొత్త ఊపు వచ్చిందన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. భారత్‌ది ప్రపంచంలోకెల్లా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. 5 కోట్ల మంది కార్మికుల ఉపాధి పొందుతున్నారని, వారికి ప్రతి నెల పోస్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. నేడు కూలీలందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు.
ధరలు పెరిగినా మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. భారత ఆర్థిక సంస్కరణలు ఇతర దేశాలు అమలు చేస్తున్నాయన్నారు. పేదల అభివృద్ధికి యూపిఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కిన ఘనత భారత్‌దే అన్నారు. ప్రజా శ్రేయస్సుకే కాంగ్రెసు ఉందన్నారు. మధ్యాహ్నం భోజన పథకం వల్ల 11 పాఠశాలల్లో హాజరు శాతం పెరిగిందన్నారు. మతాలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా కాంగ్రెసు పాటుపడుతుందన్నారు.
మధ్యాహ్నం భోజన పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. ధరలు పెరిగిన మాట వాస్తవమే అన్నారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెసు కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్, దేశంలో కొత్త రహదారుల ఏర్పాటు, తీవ్రవాద సమస్య ఉన్న చోట కొత్త రహదారులు ఏర్పాటు చేయడం కాంగ్రెసు లక్ష్యాలన్నారు. సోనియా, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పలు సంక్షేమ పథకాలను చేపడుతున్నామన్నారు. కాంగ్రెసు ప్రధానులను ప్రశంసిస్తూ ఆజాద్ దివంగత పివి నర్సింహా రావు పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం.












Click it and Unblock the Notifications