కాంగ్రెస్ భేటీలో జెండాలతో బంగి అనంతయ్య హల్‌చల్

తాను తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీ అభివృద్ధి కోసం తన ఆస్తిని మొత్తం ఖర్చు పెట్టానన్నారు. కానీ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు మోసం చేశారని విమర్శించారు. నా ఉసురు తగిలి రెండుసార్లు ఇప్పటికే అధికార పీఠానికి దూరంగా ఉన్నాడని, మూడోసారి కూడా ఓడిపోతున్నాడని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఓడుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ రోజు తనను సస్పెండ్ చేసిన రోజన్నారు.
తన సతీమణి మార్కెట్ యార్డులో కూలీ పని చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీ అని.. ఈ పార్టీ పర్మినెంట్‌గా ఉంటుందన్నారు. కాంగ్రెసు సముద్రం వంటిదని.. ప్రాంతీయ పార్టీలు సముద్రంలో కలిసి పోవాల్సిందే అన్నారు. పిల్ల కాలువలైన ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ ఉండవన్నారు. తాను ఇక నుండి కర్నూలు జిల్లా కాంగ్రెసు పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తానన్నారు.












Click it and Unblock the Notifications