కిరణ్‌కు విహెచ్ గీతాబోధ: బాబు హెరిటేజ్‌పై ఉండవల్లి

ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుందన్నారు. ఈ పుస్తకంలో డిప్యూటీ సిఎం బొమ్మ ఉండాల్సి ఉండెనన్నారు. మేథో మధన సదస్సు పెట్టాలని తాను ఎప్పటి నుండో కోరుతున్నానని కానీ ఇప్పుడు తన కోరిక నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కేవలం కలెక్టర్లతో సమావేశాలు జరిపితే సరిపోదన్నారు. కార్యకర్తలతో మమేకం అవ్వాలని హితవు పలికారు. కార్యకర్తలను గుర్తిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు.
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారిపై కఠినంగా వ్యవహరించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తండ్రి చనిపోగానే సిఎం పదవి కోసం బయటకు వెళ్లాడన్నారు. కాంగ్రెసు కోసం కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కార్యకర్తలతో మమేకం అవుతేనే పార్టీ బలపడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహా బిసి, మైనార్టీలకు ప్రత్యేక ప్రణాళికను తీసుకు రావాలన్నారు. కాంగ్రెసుతో ప్రయోజనం పొందిన మజ్లిస్ పార్టీ తమనే తిట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎఫ్‌డిఐల వల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండవని, నగదు బదలీ పథకంతో అవినీతి నిర్మూలన సాధ్యమన్నారు.
బాబు హెరిటేజ్‌లో ఎఫ్‌డిఐలు
ఎఫ్‌డిఐల వల్ల దేశానికి, రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎఫ్‌డిఐలను వ్యతిరేకిస్తున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కంపెనీలోనే ఎప్‌డిఐలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్ సహా ఏ ప్రాజెక్టులు కావాలన్నా ఫండ్స్ కావాలని, రైతుల సంక్షేమానికి ఎప్‌డిఐలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎప్‌డిఐల వల్ల దేశంలో పెట్టుబడులు పెరిగి పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చామని కేంద్రమంత్రి పళ్లం రాజు అన్నారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరగాలని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజనంతో దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెసు ప్రభుత్వం విద్యాభివృద్ధికి వెనుకడుగు వేయదన్నారు. మీడియా కథనాలు ఏమీ చేయలేదన్న అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు. సదస్సులో ఎఫ్‌డిఐలపై, విద్యారంగం, వ్యవసాయ రంగంపై తీర్మానాలు ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications