వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్ విమానాశ్రయంపై రాకెట్ దాడి: 7గురు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pakistan
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పెషావర్ పట్టణంలోని గల అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా మరో రెండు చోట్ల శనివారం రాత్రి మూడు రాకెట్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా దాదాపు 50 మంది వరకు గాయపడ్డారు. పెషావర్ విమానాశ్రయంపై, పట్టణ సమీపంలోని యూనివర్సిటీ టౌన్, ఓ నివాస సముదాయంపై రాత్రి తొమ్మిది గంటలకు ఈ దాడులు జరిగాయి.

రాకెట్ దాడిలో విమానాశ్రయంలో పేలినా భారీ ఆస్తి నష్టం మాత్రం జరగలేదు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ రాకెట్ల దాడితో పట్టణం భయాందోళనకు గురైంది. అంతకుముందు ఆయుధాలు ధరించి ఆత్మాహుతి దాడి జరిపేందుకు వచ్చిన మిలిటెంట్లపై ఎయిర్‌పోర్ట్‌లోని భద్రతా సిబ్బంది అడ్డుకొని ఎదురు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో గాయపడి తమ ఆస్పత్రిలో చేరిన వారిలో సుమారు 50 మంది వరకు తీవ్రంగా గాయాలపాలై ఉన్నారని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యుడు ఉమర్ ఆయూబ్ చెప్పారు. బాధితుల్లో చిన్నారులతో పాటు మహిళలు, వృదులు కూడా ఉన్నారన్నారు.

కాగా, ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినా తమ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పాక్ రక్షణ మంత్రి నవీద్ ఖమర్ అన్నారు. ఈ ఘటనకు తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది.

English summary
At least seven people were killed and more than 50 injured when militants launched a coordinated attack on Peshawar airport in Pakistan's northwest on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X