ఖబర్దార్! మళ్లీ...: జగన్‌పార్టీకి రాములమ్మ వార్నింగ్

ఖబర్దార్ వైయస్సార్ కాంగ్రెసు మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ప్రజలు తిరగబడుతారన్నారు. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాదయాత్ర ఎలా కొనసాగుతుందో ప్రజలే చూసుకుంటారన్నారు. తెలంగాణలో సీమ సంస్కృతిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రవేశ పెడుతోందన్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజం వరంగల్‌కు తీసుకు వస్తారా అన్నారు.
వరంగల్ కార్యాలయంపై దాడి చేసింది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కాదని... ఆ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టులని ఆరోపించారు. దాడులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రోత్సహిస్తోందన్నారు. మాతో పెట్టుకుంటే తెలంగాణలో పాదయాత్రలు చేయనివ్వమన్నారు. తెలంగాణ ద్రోహులను అడ్డుకుంటామన్నారు. భయాందోళనలు సృష్టిస్తే ప్రతిచర్యలు తప్పవన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల దాడికి నిరసనగా రేపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా బందుకు పిలుపునిస్తున్నట్లు జిల్లా ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, రాజయ్యలు తెలిపారు. సీమాంధ్ర ఉనికిని చాటుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు జగన్ పార్టీతో కుమ్మక్కయిందని మండిపడ్డారు.
లోకసభలో అసదుద్దీన్ తెలంగాణ
మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ లోకసభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ కోసం 700 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.












Click it and Unblock the Notifications