కెసిఆర్‌తో వెళ్తే..: అఖిలపక్షంపై తగ్గిన కోదండరామ్

ఈ నేపథ్యంలో కెసిఆర్ తన వెంటే మరో ప్రతినిధిగా కోదండరామ్ను తీసుకు వెళ్తానని చెప్పడం దుమారం రేపింది. దీనిని భారతీయ జనతా పార్టీ, సుపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖండించింది. తాము జెఏసిలో భాగస్వాములమేనని, అలాంటప్పుడు కోదండరామ్ తెరాస తరఫున ఎలా వెళతారని ప్రశ్నించారు. దీంతో కోదండరామ్ వెళ్లాలా లేదా అనే అంశంపై ఈ రోజు జేఎసి నేతలు భేటీ అయి చర్చించారు. భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్లుగా తెలుస్తోంది.
కెసిఆర్ గౌరవపూర్వకంగా పిలిచినప్పుడు వెళ్లడమే మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి కెసిఆర్‌తో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ వెళ్లారని గుర్తు చేశారు. అయితే వారి వాదనతో మరికొందరు నేతలు విభేదించారు.
కెసిఆర్‌తో వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని... వెళ్లకుండా ఉండటమే మంచిదని సూచించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వెళ్లకూడదనే నిర్ణయానికి జెఏసి వచ్చింది. జెఏసి నేతలు ఈ రోజు మధ్యాహ్నం కెసిఆర్‌తో భేటీ కానున్నారు. జెఏసిలో చర్చించిన అంశాలను ఆయనకు వివరించనున్నారు. అఖిల పక్షానికి కోదండరామ్ గైర్హాజరయ్యే విషయాన్ని కెసిఆర్‌తో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
23న విద్రోహ దినం
ఈ నెల 23వ తేదిన విద్రోహ దినంగా పాటించనున్నట్లు కోదండరామ్ చెప్పారు. 26వ తేదిన అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేస్తామన్నారు. 27వ తేదిన ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామన్నారు. 28న ఢిల్లీలో జెఏసి సమావేశమవుతుందన్నారు. అఖిల పక్ష సమావేశంలో పార్టీల స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications