వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మా, నాకు బతకాలనిఉంది: గ్యాంగ్‌రేప్ బాధితురాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనకు బతకాలని ఉందని ఢిల్లీ సామూహిక అత్యాచారం బాధితురాలు తన తల్లితో చెప్పింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో మూడు రోజుల వరకు ఆమె కండిషన్ క్రిటికల్‌గానే ఉంటుందని వైద్యులు చెప్పారు. బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కృష్ణ తీర్థ్ సఫ్తర్ జంగ్ ఆసుపత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు.

అనంతరం బయటకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ.. అమ్మాయికి మరో ఆపరేషన్ చేయనున్నారని చెప్పారు. అమ్మాయికి వైద్యులు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారని చెప్పారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. బాధితురాలు ప్రస్తుతం డాక్టర్లు, తన బంధువులతో మాట్లాడుతోందన్నారు.

అంతకుముందు ఉదయం బాధితురాలు తన తల్లితో మాట్లాడుతూ... అమ్మా.. నాకు బతకాలని ఉందని చెప్పింది. ఈ మాట విన్న తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె పరిస్థితి తల్లితో పాటు అక్కడున్న డాక్టర్లు, ఇతరులను కలిచి వేసింది. ఆమె అతి కష్టమ్మీద ఆ మాటలు మాట్లాడింది. ప్రస్తుతం ఆమె వెంటిలెటర్ పైన ఉంది.

I want to live: Victim is fighting for life

అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిన్నాయని, దాడి చేసిన వారు జంతువుల కన్నా ఘోరంగా ప్రవర్తించారని వైద్యులు అభిప్రాయపడ్డారు. అమ్మాయి స్నేహితుడు కూడా తీవ్రమైన ట్రామాలో ఉన్నాడని వైద్యులు చెప్పారు. గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలుపై ఐరన్ రాడ్‌తో నిందితులు దాడి చేశారని చెప్పారు.

English summary
With the health condition of the brutally gang-raped 23-year-old girl continuing to be critical, doctors at the Safdarjung Hospital in Delhi performed a second surgery on Wednesday even as they joined India to pray for her recovery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X