వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రలు రాస్తా: చిరు, చెర్రీలపై దాసరి ఘాటు వ్యాఖ్యలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో జరిగిన భాషా అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి నారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ వర్డ్ ఏదైనా ఉందా అంటే అది సూపర్ స్టార్ అన్నారు. ఇండస్ట్రీలో తాను ఎంతో మందికి లైఫ్ ఇచ్చానని, అడ్రస్‌లు ఇచ్చానని అన్నారు. ఒకప్పుడు వేషాలు ఇస్తే ఇప్పుడు గౌరవం ఇవ్వడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఒకప్పుడు తన చుట్టు తిరిగిన వారు ఇప్పుడు తాను వస్తే లేచి నిలబడాలని ఆదేశిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆంధ్రలో సూపర్ స్టార్ ఎన్టీఆర్ ఒక్కరేనని, దక్షిణాదిన సూపర్ స్టార్ రజనీకాంత్, దేశంలో అమితాబ్ అన్నారు. నా రిక్వెస్ట్‌తో ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరిన వారు ఇప్పుడు తనను చులకనగా చూస్తున్నారనే అభిప్రాయం వెలిబుచ్చారు. త్వరలో అందరి చరిత్రలు రాస్తానని, అందరి గురించి రాస్తానని, అందరి బండారాలు బయటపెడతానని అన్నారు.

నా జీవితాన్ని ఫణంగా పెట్టి కొందరు హీరోలకు జీవితాన్ని ఇచ్చానన్నారు. తాను చరిత్రలు రాస్తానని, అయితే వాస్తవాలు మాత్రమే రాస్తానని, ఎవరినీ నొప్పించనని చెప్పారు. భావి తరానికి ఇలాంటి చరిత్ర పుస్తకాలు అందాల్సిన అవసరముందన్నారు. తాను ఆశీర్వదించిన వాళ్లే తనను అనడం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు నాతో ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగే స్టార్స్ అయ్యారన్నారు. అది వారి నైజం అన్నారు.

ఇండస్ట్రీలో సూపర్ స్టార్లే ఉంటారు. కానీ స్టార్లు ఉండరన్నారు. వేషం కోసం తన చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దాసరి నారాయణ రావు కేంద్రమంత్రి చిరంజీవిని, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజను అని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాసరి ప్రధానంగా వారి ముగ్గురిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.

English summary
Dirctor Dasari Narayana Rao has make controversial comments on Thursday in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X