గొంతు కోసి రెండో భార్య హత్య: పిల్లలతో తల్లి ఆత్మహత్య

రంజాన్‌బీని ఇంటికి తెచ్చిన తర్వాత మొదటి భార్య బాషాతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రంజాన్‌బీకి, బాషాకు మధ్య నిత్యం గొడవ జరుగుతూ ఉండేది. గురువారం ఆ గొడవ కాస్తా హత్యకు దారి తీసింది. ఆమె వల్లనే తన మొదటి భార్య వెళ్లిపోయిందని గొడవ పడుతూ ఉండేవాడు. గురువారం గొడవ జరిగిన తర్వాత బయటకు వెళ్లి తిరిగి వచ్చిన బాషా రంజాన్‌బీని గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.
ఇదిలావుంటే, మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెరువురాపల్లి తండాలో గురువారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. తమ ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జ్యోతి (28) అనే మహిళ విషం తాగి, తన పిల్లలు అనిల్ (4), సునీల్ (2), సునీత (ఆరు నెలలు) విషం తాగించి ఆత్మహత్య చేసుకుంది.
జ్యోతితో పాటు అనిల్, సునీల్ అక్కడికక్కడే మరణించారు. సునీత కొనప్రాణాలతో ఉండడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు .కుటుంబ కలహాల వల్లనే పిల్లలతో సహా జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications