వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసులో ట్విస్ట్: అధికారి విచారణకు కేంద్రం ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. జగన్ కేసుకు సంబంధించి వాన్‌పిక్ అంశంలో ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి కేంద్రం అనుమతించింది. వాన్‌పిక్ కేసులో బ్రహ్మానంద రెడ్డి నాలుగో నిందితుడిగా ఉన్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ అంశానికి సంబంధించి బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ ఈ సంవత్సరం మే 15వ తేదిన అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 2007 నుండి 2009 వరకు ఆయన ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. మౌలికా వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నప్పుడు వాన్‌పిక్‌కు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డట్లుగా సిబిఐ ఆరోపిస్తోంది.

విచ్చలవిడిగా బ్రహ్మానంద రెడ్డి వాన్‌పిక్ విషయంలో కేటాయింపులు జరపాలని ఆయనను విచారించేందుకు అనుమతించాలని కేంద్రంను సిబిఐ కోరింది. కేంద్రం అతని విచారణకు ఓకె చెప్పింది. బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు రైల్వే బోర్డులో పని చేశారు. ఆయనను విచారించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ నుండి అనుమతులు జారీ అయ్యాయి. ఆయనపై ఐపిసి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఆరోపణలు ఉన్నాయి.

జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్, ఓఎంసి కేసుల్లో పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి సిబిఐకి అధికారులను విచారించేందుకు అనుమతి లభించడం ఇదే మొదటిసారి. సిబిఐ దర్యాఫ్తు కేసుల్లోనే అధికారి విచారణకు ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.

English summary
The central government has accorded permission to the CBI to prosecute senior IRAS officer Brahmananda Reddy, accused number 4 in the DA case involving the YSR Congress party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X