వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్, చిరులకు తెలంగాణ సెగ: హడావిడి స్పీచ్‌లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
వరంగల్: కాకతీయ ఉత్సవాలను ప్రారంభించడానికి వరంగల్ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, కేంద్ర మంత్రి చిరంజీవికి శుక్రవారం తెలంగాణ సెగ ఎక్కువే తాకింది. కాకతీయ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఖిల్లా వరంగల్‌లోకి పోలీసులు తెలంగాణవాదులను అనుమతించలేదు. అయినా, ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ తప్పలేదు. వరంగల్ పర్యటనలో అడుగడగునా తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. చివరికి ఖిల్లా వరంగల్ సభలో మహిళలు కుర్చీలు విసిరికొట్టడంతో గందరగోళం ఏర్పడింది. దాంతో ముఖ్యమంత్రి ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.

కాకతీయ ఉత్సవాల పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, నిధులు సరిగా విడుదల చేయలేదని మహిళలు ఆక్షేపణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ వేదికపై కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వేదికపై కూర్చుని ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్దు తగిలే ప్రయత్నం చేశారు. ఆయన ప్రసంగిస్తుండా ఎమ్మెల్యే తెలంగాణ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి శాసనసభ్యుడు వేదికి దిగి వెళ్లిపోయారు.

కాకతీయ ఉత్సవాల్లో చిరంజీవి ప్రసంగానికి కూడా తెలంగాణవాదులు అడ్డు తగిలారు. వేదికపై నుంచి ఆయన ప్రసంగించడం ప్రారంభించగానే ప్రజలు జైతెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు చిరంజీవిని డిమాండ్ చేశారు. కాకతీయ ఉత్సవాలకు నిధులు తక్కువగా ఇచ్చారని నిరసిస్తూ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఖిల్లా వరంగల్‌లోకి దూసుకుపోవడానికి ప్రయత్నించిన తెలంగాణవాదులను పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై తెలంగాణవాదులు రాళ్లు విసరడంతో ఆయన ప్రయాణిస్తున్న బస్సు అద్దాలు పగిలాయి. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బస్సుపై తెలంగాణవాదులు రాళ్లు రువ్వడంతో ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మారారు. అయినా, తెలంగాణవాదులు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. వరంగల్ కార్పోరేషన్‌ను గ్రేటర్ వరంగల్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఖిల్లా వరంగల్‌ను మెగా సర్క్యూట్‌గా గుర్తింపు ఇవ్వనున్నట్లు చిరంజీవి చెప్పారు.

English summary
Telanganites tried to obstruct CM Kiran Kumar Reddy's speech in the launching program of Kakatiya celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X