హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిలపై వ్యాఖ్యలను వక్రీకరించారు, మారను: దానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తనకు సోదరి లాంటిదని తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. షర్మిల తనకు సోదరిలాంటిదని, తాను పరామర్శిస్తానని శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం వివరణ ఇచ్చారు. షర్మిల తన సోదరి అని అన్నందుకు రాద్ధాంతం చేశారని ఆయన అన్నారు. తాను పార్టీ ఫిరాయించబోనని, కాంగ్రెసులోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు తన మొగ్గును చాటుకున్నారు. వైయస్ జగన్ సోదరి షర్మిల తనకు చెల్లెలిలాంటిదని, త్వరలోనే ఇంటికి వెళ్లి కలుస్తానని ఆయన చెప్పారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని ఆయన చెప్పారు.

షర్మిలను పరామర్శిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి తమ నాయకుడని, వైయస్ తమ గుండెల్లో ఉంటారని ఆయన అన్నారు. తన వ్యాఖ్యల్లో ఏ విధమైన రాజకీయం లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా తాను అభిమానిస్తానని చెప్పారు.

ఆ వ్యాఖ్యలతో దానం నాగేందర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగాయి. మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. దానం నాగేందర్ మొదటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యం కారణంగా దానం నాగేందర్ వైయస్ జగన్ వైపు వెళ్తారనే ప్రచారం ముమ్మరంగానే సాగింది.

ఇప్పటికిప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఏమీ లేవు. కానీ ఎన్నికలు సమీపించేనాటికి ఆయన ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారంటూ వార్తాకథనాలు వచ్చాయి.

English summary
The minister from Hyderabad Danam Nagender has clarified on his comments. He yesterday said that YSR Congress party president YS Jagan's sister Sharmila is like his sister and he will meet Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X