ఢిల్లీ రేప్: ఆమె మాట్లాడుతోంది, మానసిక బలం చాలా..

మానసికంగా ఆమె అసాధారణమైన దృఢత్వం ప్రదర్సిస్తోందని, నేడు ఆశాభావంతో కనిపించిందని వారన్నారు. ప్లేట్‌లెట్స్ కౌంట్, రక్తకణాలు పెరిగినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఇన్‌ఫెక్షన్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని అన్నారు. నిన్నటి కన్నా బాధితురాలు నేడు మెరుగ్గా ఉందని చెప్పారు.
కాగా, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను చెదరొగట్టేందుకు పలుమార్లు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. లాఠీచార్జీలో కొంత మంది విద్యార్థులు గాయపడ్డారు. గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
రాష్ట్రపతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని హోంశాఖ వర్గాలు అన్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాయి. విద్యార్థులపై లాఠీచార్జీని ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్నవారిపై లాఠీచార్జీ చేయడం దారుణమని ఆయన శనివారంనాడు అన్నారు.












Click it and Unblock the Notifications