సెక్సిస్ట్ రిమార్క్స్: నిరుపమ్‌కు ఇరానీ లీగల్ నోటీసు

Smriti Irani-Sanjay Nirupam
న్యూఢిల్లీ: బిజెపి మహిళా విభాగం చీఫ్ స్మృతి ఇరానీపై కాంగ్రెసు పార్టీ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు సంజయ్ నిరుపమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇరానీపై చేసిన అమర్యాదకరమైన, అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బిజెపి నిరుపమ్‌ను డిమాండ్ చేస్తోంది. ఓ టెలివిజన్ షోలో స్మృతి ఇరానీపై నిరుపమ్ చేసిన సెక్సిస్టు రిమార్కులను బిజెపితో పాటు కాంగ్రెసు కూడా ఖండించింది.

గుజరాత్ శాసనసభ ఎన్నికలపై ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చలో నిరుపమ్ నటి, రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. కొంత కాలం క్రితం వరకు టీవీ తెరలపై స్మృతి ఇరానీ నృత్యాలు చేసేవారని, ఇప్పుడు ఎన్నికల విశ్లేషకురాలిగా మారిపోయారని నిరుపమ్ వ్యాఖ్యానించారు.

నిరుపమ్ వ్యాఖ్యలపై బిజెపి తీవ్రంగా మండిపడి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నిరుపమ్‌పై చర్యలు తీసుకోవాలని బిజెపి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేసింది. పరువు నష్టం కలిగించారంటూ స్మృతి ఇరానీ సంజయ్ నిరుపమ్‌కు లీగల్ నోటీసు ఇచ్చారు. ఇరానీపై చేసిన వ్యాఖ్యల విషయంలో నిరుపమ్ హద్దులు దాటారని, కనీస మర్యాద కూడా పాటించలేదని బిజెపి అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ విమర్శించారు.

నిరుపమ్ వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ కూడా వ్యతిరేకించింది. నిరుపమ్ వ్యాఖ్యలు విచారకరమైనవని కాంగ్రెసు అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, అటువంటి ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

నిరుపమ్ మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, వాటిని తమ పార్టీ ఖండిస్తోందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సోనియా గాంధీ నిరుపమ్‌పై చర్యలు తీసుకుని, క్షమాపణ చెబుతారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+