రోడ్డు ప్రమాదంలో పదిమంది మృతి: కారు ఢీకొని ఇద్దరు

మృతులు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రేఖపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. రేఖపల్లి నుండి భద్రాచలంకు టాటా ఏస్ వాహనంలో వారు వెళుతుండగా లారీ ఢీకొంది. ఏస్ వెహికిల్ లారీ కింద చిక్కుకుపోవడంతో సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి క్షతగాత్రులను వెలికి తీసి సహాయక చర్యలు చేపట్టారు.
వరంగల్ జిల్లాలో యశ్వంతపూర్ ఫార్మసీ కళాశాల వద్ద కారు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పైన ముగ్గురు వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ జిల్లా మటంపల్లి మండలం చౌడపల్లి వద్ద ఉదయం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications