తెలుగుదేశం ఎమ్మెల్సీకి జగన్ పార్టీ గాలం: డైలామాలో..

ఇందులో భాగంగా శనివారం రాత్రి బొడ్డు భాస్కర రామారావుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. తమ పార్టీలోకి రావాలని వారు ఆయనను ఆహ్వానించారు. అయితే ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెసు ఆహ్వానించిన విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ మారే అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనితలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు.












Click it and Unblock the Notifications