ఢిల్లీ రేప్: పడి ఉన్న అమ్మాయిని పట్టించుకోని జనం!

అయితే ఏ ఒక్కరూ ఆ బాధితురాలికి సాయం చేయడానికి ముందుకు రాలేదట. పోలీసులు వచ్చే వరకు ఆమె అలాగే పడి ఉండాల్సి వచ్చిందట. బాధితురాలితో పాటు దుండగుల చేతుల్లో దెబ్బలు తిన్న ఆమె స్నేహితుడు ఒక షీటు తీసుకుని ఆమె ఒంటి మీద కప్పాడు. పోలీసులు రాగానే దయచేసి మా తల్లిదండ్రులకు చెప్పొద్దని వారితో చెప్పింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను మోసుకుంటూ తీసుకొచ్చి జాగ్రత్తగా వాహనంలోకి చేర్చారు.
ఆమె కదిలిన ప్రతిసారీ నోటి వెంట రక్తం వచ్చిందని పోలీసులు తెలిపారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమెను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించామని, అక్కడ మంచం మీద పడుకోబెట్టే వరకు బాధితురాలు స్పృహలోనే ఉందని చెప్పారు. తమ పరిధుల గురించి పట్టించుకోకుండా వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి చేర్చిన ముగ్గురు సిబ్బందికి రివార్డు ఇవ్వాలని సీనియర్ అధికారులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications