తెలంగాణ తల్లిలో దొరసాని రూపురేఖలు: మందకృష్ణ ఫైర్

అఖిల పక్ష సమావేశానికి పార్టీ అధినేతలు వెళ్లాలని లేని పక్షంలో పార్టీలోని దళిత ప్రతినిధులను పంపించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ నుండి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. ట్యాంకుబండు పైన తెలంగాణ కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న విమలక్క అరెస్టు పైన కెసిఆర్, తెరాస ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విమలక్కను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను విడుదల చేయని పక్షంలో వచ్చే సంవత్సరం జనవరి 3 నుండి వరంగల్ నుండి ఆమె విడుదలను కోరుతూ పాదయాత్ర చేస్తానన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ కాలయాపన చేస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications