వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచవ్యాప్త సంఘటనలను చూస్తే 2012 మరిచిపోలేనిదే. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా రెండోసారి విజయం సాధించగా, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లో నాయకత్వ మార్పిడి దిశగా సాగాయి. రష్యాలో వ్లదిమీర్ పుతిన్ తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆర్థికంగా దెబ్బ తిన్న గ్రీసుకు కొత్త నాయకుడు వచ్చాడు. సిరియా, పాలిస్తీనా, ఇరాన్ వంటి దేశాల్లో హింసాత్మక సంఘటనలతో మధ్య ప్రాచ్యం సంక్షోభాన్నే ఎదుర్కుంటోంది. లిబియాలో సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా రాయబారి హత్యకు గురయ్యాడు.

ఈ ఏడాది ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. లండన్ ఈ క్రీడలకు వేదికగా నిలిచింది. ఆతిథ్య దేశం ఇంగ్లాండు పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా మొదటి, ద్వితీయ స్థానాలు పొందాయి. ఈ క్రీడలకు ఓ మచ్చ కూడా పడింది. క్రీడాస్ఫూర్తి ప్రదర్సించలేదనే ఆరోపణపై ఎనిమిది బ్యాడ్మింటన్ డబుల్స్ మహిళా ఆటగాళ్లపై అనర్హత వేటు పడింది.

చలనచిత్ర రంగానికి సంబంధించి ఫ్రెంచ్ సినిమా ది ఆర్టిస్ ఐదు అకాడమీ అవార్డులను గెలుచుకుంది. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్‌కు ఈక్వెడార్ ఆశ్రయం ఇచ్చింది. దీంతో యుకెకు, ఈక్వెడార్‌కు మధ్య దౌత్యపరమైన సమరం సాగింది.

స్పానిష్ ఫుట్‌బాల్ జట్టు ఇటలీని ఓడించి వరుసగా రెండో సారి యూరో టైటిల్‌ను గెలుచుకుంది. ఇది వారికి మూడో గోల్డెన్ హ్యాట్రిక్. స్పానిష్ జట్టు 2010లో ఫిఫా ప్రపంచ కప్‌ను కూడా గెలుచుకుంది. గోల్ఫ్‌లో టైగర్ వుడ్స్ జాక్ నిక్లాస్ ది గోల్డెన్ బియర్ రికార్డును సమం చేసాడు. మాంచెస్టర్ సిటీ ఈ ఏడాది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌ను గెలుచుకుంది. 44 ఏళ్లలో ఇది తొలిసారి లీగ్ విజేతగా నిలిచింది. ఫార్మాలా వన్ కార్ రేసర్ మైఖెల్ షూమాకర్ తాను తప్పుకున్నట్లు ప్రకటించారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

క్వీన్ ఎలిజబెత్ 2 బ్రిటిష్ మోనార్క్ 60 ఏళ్లను ఫిబ్రవరి 6వ తేదీతో పూర్తి చేశారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఫిబ్రవరి 11వ తేదీన నాలుగు విమాన దాడులు చేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏడాది పొడువునా ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ సమరంలో పలువురు అసువులు బాశారు. పాలిస్తానా మిలిటెంట్, హమాస్ సెకండ్ - ఇన్ - కమాండ్ అహ్మద్ జబారీ నవంబర్ 14వ తేదీన హత్యకు గురయ్యాడు. ఇరు పక్షాలు నవంబర్ 21వ తేదీన కాల్పుల విరమణను ప్రకటించాయి.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

అవినీతి ఆరోపణలపై ఫిబ్రవరి 17వ తేదీన జర్మనీ అధ్యక్షుడు క్రిస్టియన్ వుల్ఫ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జోచిమ గాక్ వచ్చారు.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఏథెన్స్‌లోని నేషనల ఆర్కియోలాజికల మ్యూజియం నుంచి డెబ్బై ఏడు ఒలింపిక్ ఎయిర్‌క్రాఫ్ట్స్ దొంగతనం జరిగింది. నవంబర్‌లో ముగ్గురిని అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

సిరియా సైన్యం ఫిబ్రవరి 25వ తేదీన సిరియా సైన్యం వంద మంది పౌరులను కాల్చి చంపింది. 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం నడుస్తోంది. కోఫీ అన్నన్ యుఎన్‌కు, అరబ్ లీగ్ జాయింట్ స్పెషల్ దూతగా ఆగస్టు 2వ తేదీన రాజీనామా చేశారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఫ్రెంచ్ రోమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం ది ఆర్టిస్ట్ ఫిబ్రవరి 26వ తేదీన ఐదు అకాడమీ అవార్డులను గెలుచుకుంది. 1927 తర్వాత బహుమతి పొందిన మొదటీ మూకీ చిత్రం ఇదే. ఈ చిత్రం తెలుపు, నలుపు రంగుల్లో నిర్మితమైంది. మైఖెల్ హజానావిక్యూస్ దీనికి దర్శకత్వం వహించారు.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

సెయింట్ పాల్ కాథడ్రెల్ చర్చి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన లండన్ నిరసనకారులను తొలగించారు. లండన్‌లో ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా 2011 అక్టోబర్ 15 నుంచి 2012 జూన్ 14వ తేదీ వరకు అహింసా మార్గంలో ఉద్యమం జరిగింది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

వ్లదిమీర్ పుతిన్ మార్చి 4వ తేదీన ఎన్నికల అక్రమాల ఆరోపణల మధ్య రష్టా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డిమిట్రీ మెద్వెదేవ్ స్థానంలో ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

నాజీవార్ క్రిమినల్ జాన్ డెంజాంజుక్ 91 ఏళ్ల వయస్సులో మార్చి 17వ తేదీన మరణించాడు.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

అంతర్జాతీయ బెయిల్ అవుట్ డీల్‌కు వ్యతిరేకంగా గ్రీక్ పార్లమెంటు మార్చి 21వ తేదీన ఓటేసింది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఫ్రాంకోయిస్ హోలండే మే 6వ తేదీన ఫ్రాన్స్ 24వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టిన రెండో ఫ్రెంచ్ సోషలిస్టు పార్టీ నాయకుడు. అంతకు ముందు ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ ఈ పదవిని చేపట్టారు. నికోలస్ సర్కోజీ స్థానంలో హోలండే అధ్యక్షుడయ్యారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

గత 44 ఏళ్ల కాలంలో మే 13వ తేదీన మాంచెస్టర్ సిటీ మొదటి సారి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ గెలుచుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ నుంచి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఫిలిప్ ఫిలిప్స్ మే 23వ తేదీన 11వ అమెరికన్ ఐడల్‌గా ఎంపికయ్యాడు. ది వరల్డ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద మూన్ అతని మొదటి ప్రధానమైన లేబుల్ ఆల్బమ్.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

గోల్ఫర్ టైగర్ వుడ్ 73వ పిజిఎ టూర్‌ను జూన్ 3వ తేదీన గెలుచుకున్నాడు. తద్వారా అతను ద గోల్డెన్ బియర్ జాక్ నిక్లాస్ రికార్డును సమం చేశాడు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

న్యూ డెమొక్రసీ పార్టీకి చెందిన ఆర్థికవేత్త ఆంటోనీస్ సమరాస్ గ్రీస్ ప్రధాని పదవిని జూన్ 20వ తేదీన చేపట్టారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

జూలై 1వ తేదీన స్పెయిన్ ఇటలీని 4-0 స్కోరుతో ఓడించి యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

లండన్ 2012 ఓలింపిక్ క్రీడలు ప్రారంభమైనట్లు జులై 27వ తేదీన క్వీన్ ఎలిజబెత్ 2 ప్రకటించారు. ఈ క్రీడలు ఆగస్టు 12వ తేదీ వరకు జరిగాయి.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

మహిళల 400 మీటరల్ వ్యక్తిగత మెడ్లేలో చైనాకు చెందిన యె శివెన్ జూలై 28వ తేదీన కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

మ్యాచులను ఓడిపోయే విధంగా ఆడారనే ఆరోపణపై ఆగస్టు 1వ తేదీన 8 మంది మహిళా డబుల్స్ క్రీడాకారులపై అనర్హత వేటు పడింది.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఒలింపిక్స్‌లో పోటీ పడిన దక్షిణాఫ్రికా క్రీడాకారుడు ఆస్కార్ పిస్టోరియస్ ఆగస్టు 4వ తేదీన మొదటి అంప్యూటీగా నిలిచాడు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఆగస్టు 5వ తేదీన జనరల్ మోటార్స్ మాంచెస్టర్ యునైటెడ్ లిమిటెడ్‌తో రికార్డును బ్రేక్ చేసే 559 మిలియన్ డాలర్ల మార్కెటింగ్ డీల్‌ను కుదుర్చుకుంది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఓలింపిక్స్‌లో ఆగస్టు 9వ తేదీన జైమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ 100 మీ, 200 మీయ స్ప్రింట్ గెలుచుకున్న మొదటి క్రీడాకారుడిగా నిలిచాడు.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్‌కు ఈక్వెడార్ ఆగస్టు 16వ తేదీన రాజకీయ ఆశ్రయం ఇచ్చింది. ఆసాంజ్ లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. దీంతో యుకె, ఈక్వెడార్ మధ్య దౌత్యపరమైన విభేదాలు చోటు చేసుకున్నాయి.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

సామ్‌సంగ్ పేటెండ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆగస్టు 24వ తేదీన ఆమెరికా జ్యూరీ ప్రకటించింది.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

అఫ్గనిస్తాన్ నుంచి 2013 ఏప్రిల్ లోగా బలగాలను ఉపసంహరించుకుంటామని సెప్టెంబర్ 3వ తేదీన న్యూజిలాండ్ ప్రకటించింది. ఆగస్టులో ఐదుగురు న్యూజిలాండ్ సైనికులు మరణించారు. దీంతో న్యూజిలాండ్ సైనికల మరణాల సంఖ్య పదికి చేరుకుంది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

లిబియాలోని బెంగజీలో అమెరికా కాన్సులేట్‌పై సెప్టెంబర్ 11వ తేదీన దాడి జరిగింది. ఇందులో ఐదుగురు మరణించారు. మృతుల్లో అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ కూడా ఉన్నారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీల్లో జరిగిన ఫ్యాక్టరీ ఫైర్స్‌లో సెప్టెంబర్ 12వ తేదీన 314 మంది మరణించారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఫార్ములా వన్ రేస్ క్రీడాకారుడు అక్టోబర్ 4వ తేదీ రిటైర్ అయ్యాడు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

అక్టోబర్ 8వ తేదీన జాన్ బి. గుర్డోన్, షతిన్యా యామనాకా వైద్యంలో నోబెల్ బహుమతి పొందారు. అక్టోబర్ 12వ తేదీన యూరోపియన్ యూనియ్ 2012 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

యుఎస్ఎతో పాటు మధ్య అమెరికా ప్రాంతంలోని ఇతర దేశాలను హరికేన్ సాండీ తాకింది. 250 మందికి పైగా మరణించారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

నవంబర్ 6వ తేదీన బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ మిట్ రోమ్నీని ఆయన ఓడించారు. వరుసగా రెండు సార్లు అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన మూడో నాయకుడు ఒబామా.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

హూ జింటావో స్థానంలో నవంబర్ 15వ తేదీన జీ జింపింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆయన 2013లో చైనా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలున్నాయి.

 ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

నవంబర్ 24వ తేదీన 808 మిలియన్ వ్యూస్‌ను అధిగమించి యూట్యూబ్‌ వీడియోల్లో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డును దక్షిణ కొరియాకు చెందిన గాంగ్నమ్ స్టయిల్ నృత్యం సాధించింది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

సెబాస్టియన్ వెట్టెల్ నవంబర్ 25వ తేదీన 2012 ఫార్ములా వన్ రేస్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. అతను దీన్ని గెలుచుకోవడం వరుసగా ఇది మూడోసారి.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నవంబర్ 29వ తేదీన పాలిస్తీనాను నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేట్‌గా గుర్తించింది. ఈ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకించాయి.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

అమెరికాలోని కనెక్టికట్ ప్రాథమిక పాఠశాలలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో డిసెంబర్ 17వ తేదీన 22 మంది పిల్లలు మరణించారు. ఈ సంఘటన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేత కంటతడి పెట్టించింది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

సీనియర్ సెనెటర్ జాన్ కెర్రీని అమెరికా అధ్యక్షుడు ఒబామా విదేశాంగ మంత్రిని నియమించారు. హిల్లరీ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు

అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈజిప్టు కొత్త రాజ్యాంగంపై వివాదాస్పద రెఫరెండమ్ ఫలితాల్లో జాప్యం జరిగింది.

ఇయర్ వ్యూ: ప్రపంచంలో పదనిసలు (ఫొటోలు)

అక్టోబర్ 8వ తేదీన హ్యోగో చావెజ్ నాలుగోసారి వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

English summary
he year 2012 has been a memorable one in many respect. We have seen Barack Obama winning his second presidential term while countries like France and China witnessing leadership transition. In Russia, Vladimir Putin returned to power while an economically distressed Greece found a new leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X