టి-ఎంపీలు: టిడిపికి సూచన, అధిష్టానంపై అసంతృప్తి

టిడిపి అనుకూలంగా ఉందని చెబుతుందని తాము భావిస్తున్నామన్నారు. చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లో ఏం చెబుతున్నారో ఢిల్లీకి వచ్చి అదే చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటు కాంగ్రెసు పార్టీ చేతిలోనే ఉందన్నారు. టిడిపి మద్దతిస్తే తమ పార్టీపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. టిడిపి తెలంగాణకు మద్దతిచ్చి విశ్వసనీయతను పెంచుకోవాలని సూచించారు. తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని, దానిని అన్ని పార్టీలు గుర్తించాలని కోరారు.
కాంగ్రెసు పార్టీ అభిప్రాయం చెప్తేనే తాము చెప్తామని కొన్ని పార్టీలు చెప్పడం సరికాదని మంద జగన్నాథం అన్నారు. కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. ఆయా పార్టీలు అభిప్రాయం చెప్పి ఆ తర్వాత కాంగ్రెసు పార్టీని నిలదీయాలని, తమ మద్దతు కూడా ఉంటుందన్నారు. ఆంధ్రా ప్రాంతం నుండి ఉండవల్లి అరుణ్ కుమార్‌కు అవకాశం కల్పించినప్పుడు తెలంగాణ ప్రాంతం నుండి ఓ ఎంపీకి ఎందుకు అవకాశమివ్వడం లేదని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు.
అఖిల పక్ష సమావేశం కోసం ప్రయత్నాలు చేసిన తమకే ప్రాధాన్యత లేకుంటే ఎలా అన్నారు. అఖిల పక్షం కోసం డిమాండ్ చేసిన పార్టీలు ఆ తర్వాత వెనుకడుగు వేసేలా కనిపిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణపై ఇదే చిట్టచివరి సమావేశం కావాలని వరంగల్ ఎంపీ రాజయ్య ఆకాంక్షించారు. అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. కాంగ్రెసు కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా కేంద్రానికి వినిపించాలన్నారు.
లేకుంటే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. తెలంగాణ కోసం సరిగా వాదన వినిపించలేని నేతలను ప్రతినిధులుగా పంపించడమేమిటని ఆయన అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం లేకుంటే 1969 పునరావృతం అవుతుందని ఆయన హెచ్చరించారు.
అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు నిర్ణయం చెబుతుందని హైదరాబాదులో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అభిప్రాయపడ్డారు. తమను పిలవలేదని అందుకే వెళ్లలేదన్నారు. అఖిల పక్షం తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సుగమం అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలు వైఖరి చెప్పాలన్నారు. అవసరమైతే అధిష్టానంతో చర్చలు జరుపుతామన్నారు.
తెలంగాణపై నిర్ణయం ఎన్నికలకు ఆరు నెలల ముందు వెలువడుతుందని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు అనుకూలమైతే సీమాంధ్రలో.. సీమాంధ్రకు అనుకూలమైతే తెలంగాణలో ఆందోళనలు పెల్లుబికుతాయన్నారు.












Click it and Unblock the Notifications