4న బిజెపి జాతకం తేల్చేస్తా: షెట్టార్‌పై యడ్యూరప్పఫైట్

శెట్టార్ ప్రభుత్వం మెజార్టీని కోల్పోయిందని అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని తనంతట తానుగా శెట్టార్ గ్రహించాలని సూచించారు. లేకుంటే తామే స్వయంగా గవర్నర్‌ను కలిసి సర్కారుకు మద్దతు లేదని వివరిస్తామని చెప్పారు. వచ్చే నెల 4న గవర్నర్‌ను కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాతకాన్ని తేల్చేస్తామని ఆయన చెప్పారు.
శెట్టార్ పాలన సిగ్గు చేటు అని ఆయన కుంభకర్ణునిలా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఏడాది తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి పేదవర్గాలను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని అందుకు ఆ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అన్నారు. తాను ప్రవేశపెట్టిన భాగ్యలక్ష్మి, సంధ్యా సురక్ష, వృద్ధులకు పింఛన్ వంటి పలు పథకాలను బిజెపి నీరుగారుస్తోందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications