ఆల్ పార్టీ: షిండేకు బిజెపి లేఖ, నార్త్ బ్లాక్ వద్ద ఉద్రిక్తత

కేంద్రం తెలంగాణ ఇస్తే బిజెపి సహకరిస్తుందని చెప్పారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని, తాము మద్దతిస్తామని సూచించారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. తాము తెలంగాణకు అనుకూలమని రాసిన లేఖను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందించారు. కిషన్‌తో పాటు సీమాంధ్రకు చెందిన పార్టీ నేత హరిబాబు కూడా అఖిల పక్ష సమావేశానికి వెళ్లారు.
మరోవైపు నార్త్ బ్లాకు వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అక్కడకు భారీగా తెలంగాణ నాయకులు తరలి వస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఇరు ప్రాంతాలకు చెందిన నేతలను పంపించి వేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అఖిల పక్ష సమావేశం ముగియనున్న నేపథ్యంలో పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications