మాది స్పష్టం: బొత్స, మొదటి రాజీనామా నాదే: గంటా

షిండే ప్రకటనను వేరే ఉద్దేశ్యంతో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంశం ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలకు సంబంధించినదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో పాటు తమ పార్టీ అధిష్టానం కూడా చిత్తశుద్ధితో ఉందన్నారు.
రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రకే అనుకూలంగా ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అఖిల పక్ష సమావేశం అనంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు కేంద్రం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే మొదటి రాజీనామా తనదే అన్నారు. అఖిల పక్ష సమావేశంలోను సమైక్యాంధ్రకే మొగ్గు కనిపించిందని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు.












Click it and Unblock the Notifications