హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అటెండర్‌గా రెడీ, చిన్న పిల్లోడు: లోకేష్‌కు హరీష్ కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తనపై ట్వీట్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో అటెండర్ ఉద్యోగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తన తండ్రి చంద్రబాబుతో నారా లోకేష్ జై తెలంగాణ అనిపించాలని ఆయన సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో నారా లోకేష్‌కు జవాబు ఇచ్చారు.

నారా లోకేష్ రాజకీయంగా శైశవదశలో ఉన్నాడని, రాజకీయంగా లోకేష్ చిన్నపిల్లవాడని ఆయన వ్యాఖ్యానించారు. నారా లోకేష్ తన సవాల్‌ను అర్థం చేసుకున్నారే తప్ప దాని స్ఫూర్తిని అర్థం చేసుకోలేదని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ మోసపూరిత వైఖరితో ప్రజలను అయోమయంలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

మీడియా సమావేశం పెట్టించి చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడించాలని ఆయన లోకేష్‌ను సవాల్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే రాజకీయ హిపోక్రసీ మానుకుని తెలంగాణపై చంద్రబాబుతో మీడియా సమావేశంలో స్పష్టమైన వైఖరి చెప్పించాలని ఆయన లోకేష్‌ను డిమాండ్ చేశారు. చంద్రబాబు చేత జై తెలంగాణ అనిపిస్తే మీడియా సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఊడుస్తానని తెరాస శాసనసభ్యుడు జూపల్లి కృష్ణా రావు అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శుక్రవారం ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరీష్, నీ అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవన్ ఎదురు చూస్తోందని రాశాడు. అలాగే కెటిఆర్, రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని రాశాడు. శుక్రవారం అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అనుకూల వైఖరి చెప్పిందనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ ఆ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణకు సై అంటే ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో అటెండర్ ఉద్యోగం చేస్తానని హరీష్ రావు, తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని కెటి రామారావు గతంలో వేర్వేరు సందర్భాల్లో అన్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MLA Harish Rao has retaliated Telugudesam party president N Chandrababu Naidu's son Nara Lokesh comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X