జగన్, బాబు...: రాయలసీమ గ్యాంగ్‌రేప్ అన్న బైరెడ్డి

తెలంగాణ ఇప్పటికే నిర్ణయమైపోయిన అంశమన్నారు. రాయలసీమ గురించి మాత్రం మాట్లాడేందుకు ఒక్క నాథుడు లేడన్నారు. మా ప్రాంతంలోని పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి మాత్రం రాయలసీమను ఉపయోగించుకుంటున్నారని దోచుకునేందుకు మాత్రం సమైక్యాంధ్ర కావాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్ర ప్రదేశ్ విశాలంగా ఉంటుందని, అలా విశాలంగా ఉంటేనే ఎక్కువగా దోచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వారు ఎపి అంటున్నారని మండిపడ్డారు. అదే రాయలసీమ అయితే తక్కువ గడ్డి దొరుకుతుందని నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో సీమను వాడుకొని ఇప్పుడు విస్మరించడమేమిటని ప్రశ్నించారు.
ఓట్ల కోసం సీట్ల కోసం తెలంగాణ మీద ఉన్న ప్రేమ, అభిమానం రాయలసీమ ప్రాంత నేతలకు తమ ప్రాంతం పైన ఎందుకు లేదని ప్రశ్నించారు. అసలు వారు రాయలసీమ నేతలేనా అని ప్రశ్నించారు. సీమ నేతలా కాదా తెలుసుకునేందుకు వారికి డిఎన్‌ఏ టెస్టులు చేయించాలన్నారు. సీమపై అభిమానం లేనందుకు సిగ్గు లేదా అని నిందించారు.












Click it and Unblock the Notifications