శ్రీలక్ష్మి వెళ్లొచ్చు, హెలికాప్టర్ ఇవ్వొచ్చు కానీ...: సిబిఐ

శ్రీలక్ష్మి వైద్య చికిత్స చేయించుకొనేందుకు అభ్యంతరం లేదని సిబిఐ తెలిపింది. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న తాను ఫిజియోథెరపీ చేయించుకోవాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సిబిఐ అభిప్రాయం వెల్లడించింది. చికిత్స కోసం ఎప్పుడు వెళతారు, ఎపుడు తిరిగొస్తారనే అంశాలను కోర్టుకు తెలపాలని సిబిఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ కోరారు.
దీంతో చికిత్స వివరాలను సంబంధిత నిపుణుల నుంచి నివేదిక రూపంలో తీసుకుని కోర్టుకు ఇవ్వాలని జడ్జి దుర్గాప్రసాద రావు ఆదేశించారు. మరోవైపు ఓఎంసికి చెందిన హెలికాప్టర్‌ను తిరిగి గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించాలన్న పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.
కోర్టు నిర్ణయించిన ప్రకారం హెలికాప్టర్ ధరకు సమానంగా ఆంధ్రప్రదేశ్‌లోని స్థిరాస్తులను లేదా నగదును కోర్టుకు జమ చేయాలని సిబిఐ కోరింది. న్యాయమూర్తి ఈ కేసులో ఆదేశాలను 31వ తేదీకి వాయిదా వేశారు. కాగా సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ఓఎంసి కేసు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని విచారించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications