లగడపాటికి తెలంగాణ సెగ: కాంగ్రెసు రెండు వాదనలు

ఇరు ప్రాంతాల వాదనలు వినిపిస్తాం
నేడు జరగనున్న అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ ప్రతినిధులు ఇరు ప్రాంతాల వాదనలను వినిపిస్తారని మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ఎవరు ఏ వాదన వినిపించినప్పటికీ చివరగా తామందరం తమ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించాలని తాము కేంద్రాన్ని, తమ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
అఖిల పక్ష సమావేశానికి గాదె వెంకట రెడ్డిని పంపించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసమే దేనికైనా సిద్ధమంటున్నారని అన్నారు. చంద్రబాబును నమ్మే స్థితిలో ఇప్పుడు ఎవరూ లేరన్నారు.
అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని
కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అని గాదె వెంకట రెడ్డి అన్నారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అబ్యంతరం లేదన్నారు.
నార్త్ బ్లాకులో అఖిల పక్ష సమావేశం
నార్త్ బ్లాకులోని హోంమంత్రి కార్యాలయం 103 నెంబర్ గదిలో అఖిల పక్ష సమావేశం జరగనుంది. అఖిల పక్ష సమావేశం కోసం ఎనిమిది పార్టీలు భేటీ స్థలానికి చేరుకుంటున్నాయి. దాదాపు గంటన్నర పాటు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడనున్నారు.












Click it and Unblock the Notifications