తెలంగాణ కారం ఎలా ఉంది?: బాబుకు మహిళ ప్రశ్న

రిపుంజయ రెడ్డి అవినీతికి పాల్పడి కోట్లు కొల్లగొట్టాడని చంద్రబాబు ఆరోపించారు. తన పిఏ సూరీడు రికమండేషన్‌తో రిపుంజయ రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి ఎపిపిఎస్సీ సభ్యునిగా నియమించగా 2008కి ముందు ఇల్లు కూడా లేని అతను ఇప్పుడు కోట్లు సంపాదించాడని విమర్శించారు. టిడిపి అవినీతిరహిత పాలన అందించిందని, తిరిగి అధికారంలోకి వచ్చినా అదే పాలన అందిస్తామన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేసే బాధ్యతను తీసుకుంటుందని, 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో పాటు కరెంట్ చార్జీలను కూడా తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు, ఉపాధి లభించేలా చూస్తుందని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని అందిస్తుందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టిడిపియేనని చంద్రబాబు చెప్పారు.
తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. కాగా రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్లి మిర్చి బజ్జీలు వేస్తున్న ఓ మహిళతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను కూడా బజ్జీలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిర్చి తినగా తెలంగాణ కారం ఎలా ఉందంటూ ఆ మహిళ ప్రశ్నించింది. ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఇదే కారం తింటున్నానని ఆయన జవాబిచ్చి అందరినీ నవ్వించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications