ఢిల్లీ రేప్: విక్టిమ్ మెదడుకు గాయాలు, సీరియస్
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలికి మెదడులో గాయాలైనట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు అంటున్నారు. ఆమెకు సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. ఆమె పరిస్థితి పూర్తిగా ఆందోళనకరమైన స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. హృదయ సంబంధమైన సమస్యతో ఆమె తీవ్రంగా బాధపడుతోందని చెప్పారు. అంతేకాకుండా ఊపిరితిత్తులకు, పొట్టకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు చెప్పారు. దానికితోడు, మెదడులో గాయాలైనట్లు తెలిపారు.
బాధితురాలి ఆరోగ్యంలో నిలకడ కోసం వైద్యులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అత్యంత మెరుగైన వైద్యం అందించడానికి వీలుగా భారత హై కమిషన్ ఆస్పత్రికి, బాధితురాలి కుటుంబ సభ్యులకు సహాయం అందిస్తోంది. శారీరక పరిస్థితి సర్జరీ చేయడానికి తగిన విధంగా లేదని అంటున్నారు. భారతదేశంలోనే ఆమెకు చాలా సర్జరీలు జరిగాయి.

127వ పార్టీ వార్షిక ఉత్సవాలు నిర్వహించకూడదని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. తన మనసంతా బాధితురాలిపైనే ఉందని ఆమె అన్నారు. దోషులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ధోషులను వదిలిపెట్టేది లేదని ప్రదాని మన్మోహన్ సింగ్ అన్నారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ తీరుపై ప్రధానితో పాటు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ 127వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పడానికి సోనియా గాంధీ ఇష్టపడలేదు. బాధితురాలికి చికిత్స జరిగి, ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని సోనియా అన్నారు.












Click it and Unblock the Notifications