హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైపాల్ రెడ్డితో జానా భేటీ: చిరంజీవికి గుత్తా సలహా

By Pratap
|
Google Oneindia TeluguNews

K Jana Reddy-Gutta Sukhendar Reddy
హైదరాబాద్: తెలంగాణపై నెల రోజుల్లోగా నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నాయకులు చురుగ్గా కదులుతున్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే జైపాల్ రెడ్డి కూడా తప్పుకుంటారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యం చేకూరిందని అంటుననారు.

తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు శనివారం సాయంత్రం కె. కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. సామాజిక తెలంగాణకు చిరంజీవి కట్టుబడి ఉండాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. తెలంగాణ ఉద్యమం ద్వారా వ్యాపారం చేస్తున్నారని ప్రకటన చేసిన కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌‌లపై ఆయన మండిపడ్డారు. వ్యాపారం కోసం రాజకీయాలను ఎవరు వాడుకుంటున్నారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోతే పార్టీ మనుగడ కష్టమని ఆయన అన్నారు. తెలుగుదశం పార్టీ తెలంగాణపై మరింత స్పష్టత ఇవ్వాలని తెలంగాణ నగారా సమితి నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, వేణుగోపాలాచారి కోరారు. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తెలుగుదేశం ఇచ్చిన లేఖలో ఏ విధమైన స్పష్టత లేదని వారన్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీ వైఖరిని తెలంగాణ నగారా సమితి నాయకులతో పాటు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు కూడా శుక్రవారం అహ్వానించారు. అయితే, శనివారం తెలుగుదేశం పార్టీ వైఖరిలో స్పష్టత లేదంటూ తప్పుపడుతున్నారు.

English summary
The minister K Jana Reddy has met union minister S Jaipal Reddy. Congress Telangana MP Gutta Sukhender Reddy has suggested Rajyasabha member Chiranjeevi on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X