తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో టిడిపి నన్నపనేని 'మహాద్వార' వివాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు మహా ద్వార ప్రవేశం ద్వారా వెళ్లడం వివాదాస్పదమవుతోంది. సాధారణంగా మహాద్వార ప్రవేశం కొందరికే ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు మహాద్వార ప్రవేశం ఉంటుంది. ఇతరులకు ఉండదు.

కానీ ఈ రోజు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మహాద్వార ప్రవేశం చేశారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. నన్నపనేనిని మహాద్వార ప్రవేశం ద్వారా అనుమతించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమని అంటున్నారు. నన్నపనేని వెళుతుండగా భద్రతా సిబ్బంది ఎవరూ అడ్డుకోలేదు. దీంతో భద్రతా వైఫల్యమే ఇందులో కనిపిస్తోందని అంటున్నారు.

ఇటీవల నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలు ప్రారంభించేందుకు తిరుపతి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో కేవలం ప్రణబ్‌ను మాత్రమే మహాద్వార ప్రవేశం అనుమతించారు. కనీసం ఆయన భద్రతా సిబ్బందిని కూడా అనుమతించలేదు. కానీ ఇప్పుడు రాజకుమారిని భద్రతా సిబ్బంది ఆపక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

English summary
Telugudesam Party senior leader and MLC Nannapaneni Rajakumari has entered from Mahadwara on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X